ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర బడ్జెట్(2012-13)ను
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం
రామనారాయణరెడ్డి 2012,
ఫిబ్రవరి 17న అసెంబ్లీకి సమర్పించారు. శాసనమండలిలో బడ్జెట్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.
మొత్తం బడ్జెట్ అంచనా రూ.1,45,854
కోట్లు. ఇది గత బడ్జెట్ (2011-12)
అంచనాల
కన్నా 14 శాతం ఎక్కువ. బడ్జెట్ మొత్తంలో ప్రణాళికా వ్యయం రూ.54,030 కోట్లు.
ప్రణాళికేతర వ్యయం రూ.91,824 కోట్లు.
ద్రవ్యలోటు రూ.20,009 కోట్లు. రెవెన్యూ
వసూళ్లు రూ.1,16,786 కోట్లు.
ఇది 2011-12 అంచనాల
కన్నా 16 శాతం ఎక్కువ.
బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన ఎక్కడా లేదు. గత ఏడేళ్ల సగటు వృద్ధి రేటులో
జాతీయ సగటు రేటు 8.64 శాతం
ఉంటే రాష్ట్రం వృద్ధి రేటు అంత కంటే
ఎక్కువ అంటే 9.6
శాతంగా ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
జాతీయ సగటు వృద్ధి రేటు రాష్ట్రం కంటే కొద్దిగా ఎక్కువగా 6,8 శాతం ఉందని
కూడా వివరించారు.
ప్రధాన అంశాలు:
- రాజీవ్
యువకిరణాల పథకానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో
రూ.777
కోట్లు కేటాయించారు. లక్ష ఉద్యోగాలు కల్పించారు.
- రైతులకు, స్వయం
సహాయక మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1075 కోట్లు
కేటాయించారు.
- రూపాయికి
కిలోబియ్యం పథకం వల్ల 7.25
కోట్లమంది లబ్ది పొందుతారని
అంచనా.
- రచ్చబండలో 50 లక్షల
మందికి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ,
పింఛన్లు, ఇళ్ల
స్థలాలు ఇచ్చారు.
- జలయజ్ఞంలో
ఇప్పటిదాకా 13 ప్రాజెక్టులు
పూర్తయ్యాయి. 21 ప్రాజెక్టులు
పాక్షికంగా పూర్తయ్యాయి. 20.9
లక్షల ఎకరాలకు సాగునీరు అందింది.
- గత ఏడాది
రాష్ట్ర ఐటీ,అనుబంధ
రంగాల ఎగుమతులు రూ.35022 కోట్లు.
ఈ రంగం ద్వారా 2.79 లక్షల
మందికి ఉద్యోగాలు వచ్చాయి.
- 6.48
లక్షల కోట్ల విలువైన 243 ఎంఓయూలు
కుదిరాయి. వీటి ద్వారా 6.78
లక్షల మందికి ఉపాధి లభించింది.
దేశంలో పెట్టుబడుల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో
ఉంది. మొదటి రెండు స్థానాలు గుజరాత్,
మహారాష్ట్రలు ఆక్రమించాయి.
- 32 సెజ్‌ల ద్వారా గతేడాది (2011-12) రూ.13 వేల కోట్ల ఎగుమతులు జరిగాయి. ఇది మొత్తం జాతీయ సెజ్
ఎగుమతుల్లో 6
శాతం.
- రాష్ట్ర
పారిశ్రామికాభివృద్ధి రేటు 7.33
శాతంగా ఉండగలదని అంచనా.
- ఇందిర జలప్రభ
ద్వారా 10 లక్షల
ఎకరాల బీడు భూములు సాగులోకి రాగలవని అంచనా.
- ఆహారధాన్యాల
దిగుబడి 14.82 శాతం, నూనె
గింజలు 36.09 శాతం
తగ్గుతాయి. - సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ర్ట వాటా 40 శాతంగా
ఉంది.
- పాఠశాలల్లో
ఉన్నత విద్య అభ్యసించే వారి శాతం 17
శాతం. జాతీయ స్థాయిలో వీరి
శాతం 13.8 శాతం
కావడం గమనార్హం. 2020 నాటికి
రాష్ట్రంలో ఉన్నత విద్య
అభ్యసించే వారిని 30 శాతానికి
పెంచాలన్నది లక్ష్యం.
- గృహ
నిర్మాణానికి రూ.2300 కోట్లు
కేటాయించారు. ఇందులో రూ.400
కోట్లు రుణాల చెల్లింపు నిమిత్తం
ఇచ్చారు.
- ప్రతి
అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఇండోర్,
అవుట్‌డోర్ స్టేడియం
నిర్మాణానికి రూ.220
కోట్లు కేటాయించారు.
- ఇకపై ఆర్థిక
కార్యకలాపాలన్నీ పారదర్శకంగా ఉండేందుకు వీలుగా ఆన్‌లైన్ కొనసాగిస్తారు.
బడ్జెట్ స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)
|
బడ్జెట్ మొత్తం
|
1,45,854
|
|
ప్రణాళికేతర వ్యయం
|
91,824
|
|
ప్రణాళికా వ్యయం
|
54,030
|
|
రెవెన్యూ వసూళ్లు
|
1,16,786
|
|
ఇందులో...
|
|
|
ఎ) కేంద్ర పన్నుల్లో వాటా
|
21,965
|
|
బి) రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయం
|
66,021
|
|
సి) గ్రాంట్స్ ఇన్ ఎయిడ్
|
14,949
|
|
డి) పన్నేతర ఆదాయం
|
13,852
|
|
మూలధన ఆదాయం
|
29,478
|
|
మొత్తం ఆదాయం
|
1,46,265
|
|
రెవెన్యూ ఆదాయం
|
1,12,342
|
|
మూలధన వ్యయం
|
19,973
|
|
రుణాలు, అడ్వాన్సులు
|
4,726
|
|
మూలధన చెల్లింపులు
|
8,813
|
|
మొత్తం వ్యయం
|
1,45,854
|
|
మొత్తం ఆదాయం
|
1,46,265
|
|
నికర మిగులు
|
411
|
|
రెవెన్యూ మిగులు
|
4,445
|
|
ద్రవ్యలోటు
|
20,009
|
ఏ విభాగానికి
ఎంత?
|
శాఖ
|
2011-12
|
2012-13
|
|
ఇరిగేషన్
|
15,010
|
15,013
|
|
పంచాయతీ రాజ్,
గ్రామాభివృద్ధి
|
4,953
|
5,855
|
|
విద్య
|
4,461
|
4,799
|
|
మున్సిపల్,
పట్టణాభివృద్ధి
|
3,676
|
6,586
|
|
రవాణా, ఆర్ అండ్ బీ
|
2,676
|
3,210
|
|
గృహ నిర్మాణం
|
2,300
|
2,300
|
|
వ్యవసాయ, సహకార శాఖ
|
2,148
|
2,819
|
|
వైద్య, ఆరోగ్యం
|
2,117
|
2,364
|
|
మహిళా,శిశు సంక్షేమం
|
1,856
|
2,282
|
|
సాంఘిక సంక్షేమం
|
1,549
|
1,719
|
|
గిరిజన సంక్షేమం
|
692
|
1,013
|
|
మైనారిటీల సంక్షేమం
|
295
|
482
|
|
బీసీ సంక్షేమం
|
1,502
|
2,656
|
|
ప్రణాళిక విభాగం
|
1,023
|
1,143
|
|
పశుసంవర్ధకం,
ఫిషరీస్
|
370
|
504
|
|
రెవెన్యూ
|
226
|
399
|
|
న్యాయ విభాగం
|
14
|
102
|
|
యువజన సర్వీసులు
|
168
|
343
|
|
టూరిజం, సాంస్కతిక శాఖ,
ఐటీ,
వాణిజ్య విభాగం
|
48
|
148
|
(ప్రణాళికా కేటాయింపులు రూ.కోట్లలో)
|
సబ్సిడీలు (విద్యుత్,
బియ్యం సబ్సిడీలు వగైరా)
|
12,692
|
|
ఉద్యోగుల జీత భత్యాలు
|
30,598
|
|
|
ప్రధాన రంగాలు - కేటాయింపులు
వ్యవసాయ రంగం:
- తాజా బడ్జెట్‌లో
వ్యవసాయానికి రూ.5,545.76
కోట్లు కేటాయించారు. గత (2011-12)
బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ.4,132.09
కోట్లు.
- పంట నష్టపోయిన
52 లక్షల
మంది రైతులకు రూ.1,916 కోట్లు
పరిహారం ఇవ్వటానికి నిర్ణయం
- రైతులకు పావలా
వడ్డీ కోసం రూ.200 కోట్లు
కేటాయించారు.
- పంటల బీమా
పథకానికి రూ. 300 కోట్లు
కేటాయించారు.
- వైపరీత్యాల
వల్ల 5 ఎకరాల
కంటే ఎక్కువ నష్టపోయిన రైతుల సహాయం కోసం కోటి రూపాయాలు కేటాయించారు.
- ప్రస్తుత రబీ
నుంచి ‘వడ్డీ
లేని పంట రుణం’ పథకం
కింద రైతులకు లక్ష రూపాయలు ఇస్తారు.
- వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు
పరిశ్రమ శాఖలన్నీ వ్యవసాయ రంగం కిందికే వస్తాయి.
- వ్యవసాయానికి
రూ.2,572 కోట్లు
కేటాయించగా, పశుసంవర్ధకం, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలకు
కలిపి రూ.1341 కోట్లు
కేటాయించారు.
- పులివెందులలో
రూ.38.60 కోట్లతో
పశుగణం కోసం అధునాతన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
విద్యా రంగం:
- ప్రస్తుత
బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.19,428.60 కోట్లు కేటాయించారు. గ త 2011-12
బడ్జెట్ ఈ మొత్తం రూ.17,149.60 కోట్లు.
- పాఠశాల
విద్యకు రూ.15,511.43 కోట్లు ఇచ్చారు.
- ఉన్నత విద్యకు
2,829 కోట్లు
కేటాయించారు. సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు అదనంగా
రూ.335.82 కోట్లు
పెంచారు (గత సంవత్సరం ఇది రూ.384.14
కోట్లు)
- సాంకేతిక
విద్యకు రూ.649 కోట్లు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి
రూ. 560
కోట్లు, జేఎన్‌టీయూ
హైదరాబాద్‌కు రూ.36
కోట్లు ఇచ్చారు.
- సర్వశిక్షా
అభియాన్‌కు గత ఏడాది రూ.984 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.1,543
కోట్లకు పెంచారు.
పారిశ్రామిక రంగం:
- పారిశ్రామిక
రంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.633.12 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ.354.46
కోట్లు.
- పారిశ్రామిక
రాయితీలకు రూ.203 కోట్లు
కేటాయించారు.
- పావలా వడ్డీ
కోసం రూ.221 కోట్లు
ఇచ్చారు.
- షెడ్యూల్డు
కులాల పారిశ్రామికాభివృద్ధికి రూ.82
కోట్లు కేటాయించారు. గత ఏడాది
ఇది రూ.31 కోట్లుగా
ఉంది.
- గిరిజన
ప్రాంతాల్లో ప్రోత్సాహకాలను రూ.13
కోట్ల నుంచి రూ. 30 కోట్లకు
పెంచారు.
సాగునీటి ప్రాజెక్టులు:
- సాగునీటి
శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15,013 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.15,010
కోట్లు.
- చిన్న తరహా
ప్రాజెక్టులకు రూ.2,325 కోట్లు
కేటాయించారు.
- చెరువుల
అభివృద్ధికి రూ. 349 కోట్లు
కేటాయించారు.
- కృష్ణా డెల్టా
ఆధునికీకరణకు రూ. 295 కోట్లు
కేటాయించారు
- గోదావరి
డెల్టా ఆధునికీకరణకు రూ.301
కోట్లు కేటాయించారు.
- దివంగత నేత
వై.ఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరిత 86
ప్రాజెక్టుల నిర్మాణం
చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో
21 ప్రాజెక్టులను
పాక్షికంగా పూర్తి చేసి... సుమారు19
లక్షల ఎకరాలకు
సాగునీటిని అందించారు.
- ప్రస్తుతం
ప్రాజెక్టుల వారిగా బడ్జెట్ కేటాయింపులు

సంక్షేమ రంగం:
- ఎస్సీ,ఎస్టీ,బీసీ
సంక్షేమ శాఖలకు మొత్తం రూ. 7,253
కోట్లు కేటాయించగా అందులో
ఈ శాఖల పరిధిలోని హాస్టళ్ల నిర్వహణ,
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు రూ.
4,698
కోట్లు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్‌లో 68
శాతం వీటికే పోతుంది.
- అందులో ఎస్సీ
హాస్టళ్లకు రూ.566 కోట్లు, ఎస్టీ
వసతి గహాలకు రూ.502 కోట్లు, బీసీ
హాస్టళ్లకు రూ.364 కోట్లు
కేటాయించారు.
- మహిళా శిశు
సంక్షేమానికి రూ.2,225 కోట్లు, వికలాంగులు, వయోవృద్ధులకు
రూ.43.5 కోట్లు, బాలల
సంరక్షణకు రూ.12.84 కోట్లు
కేటాయించారు.
- ఫీజు
రీయింబర్స్‌మెంట్‌కు కేటాయించిన రూ.3,600 కోట్లతో పాటు హాస్టల్ విద్యార్ధుల
డైట్ చార్జీలు రూ.200 కోట్లను
ప్రణాళిక వ్యయంలో చేర్చారు.
- అనాధ పిల్లలు, వృద్ధుల
కోసం ‘అనురాగ
నిలయాలు’ ఏర్పాటు
చేయడానికి రూ.15.28 కోట్లు
కేటాయించారు.
విద్యుత్ రంగం :
- ప్రస్తుత
బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.5,937 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ.4,980
కోట్లు.
- ఈ రంగానికి
ఇచ్చిన మొత్తం కేటాయింపులో ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.5,522
కోట్లు కేటాయించారు.
- రాష్ట్రంలోని
విద్యుత్ రంగ సంస్థల (జెన్‌కో,
ట్రాన్స్‌కో, డిస్కం)కు
ప్రభుత్వ సబ్సిడీ తప్ప ఇతరత్రా కేటాయింపులు ఏవీ చేయలేదు.
- ప్రస్తుతం
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు రూ.12
వేల కోట్ల మేర లోటును ఎదుర్కొంటున్నాయి.
ఇందులో మూడేళ్ల క్రితం అదనపు విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన
రూ.7 వేల
కోట్లు కూడా ఉంది.
ఆరోగ్య రంగం:
- ఆరోగ్యరంగానికి
రూ.5890.26
కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో రూ.4.04
శాతం.
- నిమ్స్
(హైదరాబాద్)కు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 41 కోట్లు
కేటాయించారు.
- మందులకు రూ.326.70
కోట్లు, ఆస్పత్రుల్లో
ఎక్స్‌రే సదుపాయాల కల్పనకు రూ.10 కోట్లు ఇచ్చారు.
హోం శాఖ:
- తాజా బడ్జెట్‌లో
హోంశాఖకు రూ.4,832.80
కోట్లు కేటాయించారు. గట బడ్జెట్‌తో పాలిస్తే రూ.751
కోట్లు అదనంగా కేటాయించారు.
- నక్సల్స్ నిరోధక
విభాగం గ్రేహౌండ్స్‌కు రూ.82.43 కోట్లు ఇచ్చారు.
- రాష్ట్ర నిఘా
విభాగానికి రూ.172.16 కోట్లు
ఇచ్చారు.
- జైళ్ల శాఖకు
రూ.197.50 కోట్లు
కేటాయించారు.
- ఉగ్రవాద
నిరోధక విభాగం ఆక్టోపస్ కు రూ. 59.42
కోట్లు ఇచ్చారు.
చేనేత రంగం:
- ఈ రంగానికి
తాజా బడ్జెట్‌లో రూ. 200.65 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ.286.04
కోట్లుగా ఉంది.
- సమగ్ర చేనేత
అభివద్ధి పథకానికి కేటాయింపులు రూ.11.30
కోట్లు నుంచి రూ.40.44 కోట్లకు
పెరిగాయి.
- చేతన రుణ మాఫీ
కేటాయింపులను రూ.200 కోట్ల
నుంచి రూ.100 కోట్లకు
తగ్గించారు.
ఉపాధి హామీ:
- ఉపాధి హామీకి
తాజా బడ్జెట్‌లో రూ.5,064 కోట్లు కేటాయించారు.
- మహిళలకు
వడ్డీలేని రుణాలు అందించటానికి రూ. 424.60
కోట్లు ఇచ్చారు.
- సామాజిక
పింఛన్లకు రూ. 2,436 కోట్లు
కేటాయించారు.
- గ్రామీణ
ఉపాధికి రూ. 400 కోట్లు
ఇచ్చారు.
ఇతర ముఖ్యాంశాలు:
- ముఖ్యమంత్రి
విచక్షణాధికార నిధిని రూ.400
కోట్ల నుంచి రూ.600 కోట్లకు
పెంచారు.
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల
శాఖ ఆదాయం 20 శాతం
పెంచాలని నిర్ణయించారు.
- మద్యం అమ్మకాల
ద్వారా కూడా ఆదాయం 20 శాతం
పెంచాలని నిర్ణయించారు.
- తాగునీటికి
ప్రస్తుత బడ్జెట్‌లో రూ.626 కోట్లు కేటాయించారు
- బలహీనవర్గ గహ
నిర్మాణానికి రూ.2302.02 కోట్లు
కేటాయించారు. రచ్చబండ కార్యక్రమం కింద 15
లక్షల ఇళ్లు ఇవ్వనున్నారు.
- రహదారులకు
తాజా బడ్జెట్‌లో రూ.5012.01 కోట్లు కేటాయించారు.
- పౌరసరఫరాలకు
ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించారు.
- 2.25
కోట్ల తెల్ల కార్డుదారులకు 3.25 లక్షల
మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తున్నారు.
- రేషన్ పంపిణీ
వ్యవస్థను పటిష్టపరచడానికి రూ. 77.40
కోట్లు కేటాయించారు.
- రాజీవ్
యువశక్తి పథకానికి రూ.32.11
కోట్లు ఇచ్చారు.
- కార్మిక, ఉపాధి
కల్పన శాఖకు రు.500 కోట్లు, రాజీవ్
ఉద్యోగశ్రీకి రూ.40 కోట్లు
ఇచ్చారు.
- ఆర్టీసీకి 2 వేల
కొత్త బస్సుల కొనుగోలుకు రు.100
కోట్ల రుణం
- నియోజకవర్గాల
అభివద్ధి కార్యక్రమానికి రూ.395
కోట్లు కేటాయించారు.
- ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ (ఐటీ) శాఖకు రూ. 150.53
కోట్లు ఇచ్చారు.
- పర్యాటక,సాంస్కతిక
శాఖలకు మొత్తం రూ.111.77 కోట్లు
కేటాయించారు.
- రాష్ట్రం
మొత్తం బడ్జెట్ రూ.1,45,854 కోట్లు అయితే రుణ భారం అక్షరాలా రూ.1,60,191 కోట్లు. ఈ అప్పుకు తోడు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు
ప్రభుత్వం గ్యారంటీ
కింద ఇప్పించిన రుణ మొత్తం రూ.10.048
కోట్లు ఉంది. ఈ మొత్తాన్ని కూడా
కలుపుకుంటే మొత్తం రుణ భారం రూ.1,70,239
కోట్లకు చేరుతుంది. తాజా జనాభా
లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.4
కోట్లు. అంటే... రాష్ట్ర ప్రజల ఒక్కొక్కరిపై
ఉన్న (తలసరి) అప్పు 20,266.5
రూపాయలు.
- ఈ అప్పులతో
పాటు వడ్డీ భారమూ భారీగా పెరుగుతోంది. ఈ అప్పులపై గత ఏడాది రూ.11,437 కోట్ల
మేరకు వడ్డీ చెల్లించగా.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చెల్లించే
వడ్డీ రూ.12,226 కోట్లు.
కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వంపై పెరిగిన వడ్డీ
భారం రూ.789 కోట్లు.
ప్రతినెలా రూ.1,018.8 కోట్ల
ఆదాయం వడ్డీ చెల్లింపులే సరిపోతుంది.
|
No comments:
Post a Comment